Movies
మేము నక్సలైట్లం కాదు.. సెన్సార్ బోర్డు పై నారాయణమూర్తి ఫైర్

మేము నక్సలైట్లం కాదు.. సెన్సార్ బోర్డు పై నారాయణమూర్తి ఫైర్
కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు సెన్సార్ కట్స్ పై దర్శకుడు ఆర్. నారాయణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా సెన్సార్ విషయంలో కొన్ని సన్నివేశాలు, దుస్తుల పై అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన నారాయణమూర్తి.. కళాకారులకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలని, సమాజంలో జరుగుతున్న పరిణామాలను సినిమాల ద్వారా చూపించే ప్రయత్నాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
కామెడీ మూవీకి ఏ ఉద్దేశంతో సెన్సార్ కట్స్ విధించారు? ఆలివ్ గ్రీన్ డ్రెస్ వేసుకుంటే కట్ చేస్తారా? నక్సలైట్లు ఏం పాపం చేశారు? వారూ ఈ మట్టి బిడ్డలే. వారూ భారతీయులే. కానీ మేము నక్సలైట్లం కాదు.. సినిమా తల్లి బిడ్డలం. సమాజంలో ఏం జరుగుతుందో చెప్పే కళాకారులం అంటూ ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. సినిమా కథాంశాన్ని, అందులోని పాత్రలను వాటి నేపథ్యం ఆధారంగా పరిశీలించాలని ఆయన వ్యాఖ్యల ద్వారా సూచించారు. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు చర్చకు మరోసారి తెరలేపాయి.
Posted by Beyond I Media· Admin
Views · 14








