Bakthi
దసరాలో ఏ రోజు ఏం చేస్తారు?

దసరాలో ఏ రోజు ఏం చేస్తారు?
హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆశ్వయుజ మాసంలో జరుపుకునే శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. పదో రోజైన విజయదశమిని చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి ఒక్కో రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉందని భక్తులు విశ్వసిస్తారు. మొదటి రోజు – శైలపుత్రి దేవి, రెండో రోజు – బ్రహ్మచారిణి దేవి, మూడో రోజు – చంద్రఘంట దేవి, నాలుగో రోజు – కూష్మాండ దేవి, ఐదో రోజు – స్కందమాత దేవి, ఆరో రోజు – కాత్యాయని దేవి, ఏడో రోజు – కాళరాత్రి దేవి, ఎనిమిదో రోజు – మహాగౌరి దేవి, తొమ్మిదో రోజు – సిద్ధిదాత్రి దేవి, తొమ్మిది రోజుల నవరాత్రుల అనంతరం పదో రోజున విజయదశమిని జరుపుకుంటారు. పురాణ విశ్వాసాల ప్రకారం, ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి ధర్మాన్ని రక్షించింది. అందుకే విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను విభిన్న సంప్రదాయాలతో జరుపుకుంటారు. అయితే.. ఐదవ రోజైన ఈరోజున స్కందమాత దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు..
Posted by Beyond I Media· Admin
Views · 45








