Movies
అనిరుధ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

అనిరుధ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
అనిరుధ్ పెళ్ళి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన కుటుంబ నేపథ్యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సంగీత దర్శకుడిగా, గాయకుడిగా అనిరుధ్ గురించి చాలామందికి తెలుసు. కానీ ఆయన కుటుంబం గురించి చాలా మందికి తెలియదు. అనిరుధ్ రవిచందర్ తండ్రి రవి రాఘవేంద్ర నటుడిగా గుర్తింపు పొందారు. ఆయన పలు తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక అనిరుధ్ తల్లి లక్ష్మి శాస్త్రీయ నృత్యంతో అనుబంధం ఉన్న కుటుంబ నేపథ్యానికి చెందినవారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కుటుంబంతోనూ అనిరుధ్‌కు బంధుత్వం ఉంది.
రజినీకాంత్ భార్య లతకు అనిరుధ్ మేనల్లుడు అవుతారు. ఈ బంధుత్వం కారణంగా కూడా అనిరుధ్ కుటుంబ నేపథ్యం తరచూ వార్తల్లో ప్రస్తావనకు వస్తుంటుంది. అనిరుధ్ ముత్తాత కె. సుబ్రమణ్యం. భారతీయ సినిమా తొలి దశలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన తాత ఎస్.వి. రామనన్ టెలివిజన్, ప్రకటనలు, సంగీత రంగాల్లో పని చేసిన వ్యక్తిగా పేరుపొందారు. ఇలా పలు తరాలుగా కళలు, సినిమా, సంగీతంతో అనిరుథ్ ఫ్యామిలీకి అనుబంధం ఉంది.
Posted by Beyond I Media· Admin
Views · 23








